Home » New Delhi
ఓ వైపు వేసవి కాలం.. మరోవైపు ఢిల్లీలో మంచినీటి సరఫరాను హరియాణా నిలిపివేసింది. దీంతో న్యూఢిల్లీలో తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వేళ మంచి నీటి వృధా చేయకుండా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
న్యూఢిల్లీ: తెలంగాణ లో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని, అందె శ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారంనాడు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఒక దశలో కోర్టులోనే స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
సంచలనం సృష్టించిన 'ఆప్' ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారంనాడు తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణతో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నరేంద్ర మోదీ వారసుడిగా అమిత్‌షా ఎన్నికైన కారణంగానే ఆయన 'దురహంకారం' ప్రదర్శిస్తున్నారని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్‌షా పోలుస్తున్నారని అన్నారు.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై అయిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫెకెట్లను తొలి బ్యాచ్‌కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా బుధవారంనాడు ప్రదానం చేశారు.