Home » New Delhi
దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్) సంకల్పించింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.
పరువు నష్టం కేసులో హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ కు ఢిల్లీ సాకేత్ కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. పిటిషనర్ వీకే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ మహానగరగం అతలాకుతలమవుంది. ఆ క్రమంలో ఎక్కడి వర్షపు నీరు అక్కడ నిలిచిపోయింది.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.
దేశ రాజధాని న్యూడిల్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలో నీటి కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. దీంతో మంచి నీటి కోసం భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు.
సౌదీ అరేబియాలోని హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయులు వడదెబ్బతో మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారంనాడు తెలిపారు. ఇవన్నీ సహజ మరణాలేనని వెల్లడించారు.
ఢిల్లీ నీటి సంక్షోభంపై 'ఆప్' మంత్రి అతిషి శుక్రవారం మధ్యాహ్నం నిరవధిక 'సత్యాగ్రహ దీక్ష'ను ప్రారంభించారు. హర్యానా నుంచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన జలాలు రాకపోవడంతో దేశ రాజధాని నీటి సంక్షోభంలో చిక్కుకుందని, తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని రెండ్రోజుల క్రితం అతిషి లేఖ రాశారు.
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధానిలో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక దీక్షకు దిగుతానని రాష్ట్ర మంత్రి అతిషి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారంనాడు లేఖ రాశారు. ఢిల్లీ ప్రజానీకం ఎదుర్కొంటున్న నీటి కొరత, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.