Home » New Delhi
70 ఏళ్లు పైబడిన వారిందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా మంగళవారంనాడిక్కడ ప్రధాని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రెయిడ్స్ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఢిల్లీకి చెంది ఒక వ్యాపారి తీహార్ జైల్ వార్డెన్‌తో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు గుర్తించారు.
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ ప్రకటించారు.
ఈ రోజుల్లో సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు.
చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని జైశంకర్ అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు.
డిజిటల్ సెక్యూరిటీ కోసం 3 జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని తెలిపారు. ''ఆగండి, ఆలోచించండి, చర్య తీసుకోండి'' అనేవి మూడు స్టెప్స్ అని చెప్పారు. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, కాలర్ మాటలు రికార్డు చేయండి. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లలో బెదిరించడం కానీ, డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఉండదు.. అని ప్రధాని తెలిపారు.
పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. మొబైల్ నెట్వర్క్ జామర్ తరహాలో ఇది పనిచేస్తుందని, మొబైల్ నెట్వర్క్ జామర్గా పనిచేసే ఎలాంటి పరికరాన్ని అమ్మినా అది చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు.
పరీక్షల్లో ఫెయిలయితే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కూడా తన తల్లితో ఆ అమ్మాయి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, తల్లి హోమ్‌మేకర్ అని వారు వివరించారు.
యమునా నదీ జలాల క్లీనింగ్ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్దేవ గత గురువారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఐటీఓ సమీపంలోని గంగా ఘాటా వద్ద స్నానం చేశారు. యమునా నది పరిస్థితిపై పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన సవాలు విసిరారు.
‘‘రూ.లక్షల్లో కాదు.. కోట్లలో వేతనాలు. కూర్చున్న చోట నుంచి కదలాల్సిన పని కూడా లేదు. అలుపెరుగకుండా ఆయాసం లేకుండా పని చేసుకునే వెసులుబాటు. రండి! చేరండి!’’ ఇవీ.. సోషల్ మీడియాలో తరచుగా కనిపించే ప్రకటనలు.