Home » New Delhi
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
జాతీయ బీసీ కమిషన్ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఘోరం జరిగింది. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.
ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రధానిని కలుసుకున్నానని, ప్రధానిగా ఆయన తమ వినతులను ఆలకించారని ఎంకే స్టాలిన్ చెప్పారు. ప్రధానంగా ప్రధానికి మూడు వినతలు చేసినట్టు చెప్పారు.
ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రికి 'జడ్' కేటగిరి భద్రత వర్తిస్తుంది. జడ్ కేటగిరి భద్రత కింద షిప్టుల వారిగా ఢిల్లీ పోలీసులు 22 మందిని మోహరించారు.
దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్న ఎన్నికలు. అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను 15 మంది వివిధ దేశాల దౌత్యవేత్తల బృందం పరిశీలిస్తుంది. అందుకోసం బుధవారం ఉదయం ఈ ప్రతినిధి బృందం శ్రీనగర్ చేరుకుంది. అనంతరం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని పరిశీలించి.. ఓటర్లతో ఈ ప్రతినిధి బృందం మాట్లాడుతుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈరోజు బాధ్యతలు చేపట్టానని, 14 ఏళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగించినప్పుడు భరతుడి మనోగతం ఎలాగ ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్‌తోనే ఉన్నట్టు అతిషి చెప్పారు.
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్, బీజేపీ స్పష్టంగా పడే అవకాశముందని అంటున్నారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కుప్పకూలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మొత్తం 70 సీట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజలే బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని, బీజేపీకి జీరో స్కోర్‌కే పరిమితమవుతుందని అతిషి తెలిపారు.