Home » New Delhi
ప్రధాన బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటర్మేడియేటరీస్, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఐడీ ఇంటర్మేడియేటరీస్, కేంద్ర, రాష్ట్ర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎంఎస్)ను ఏర్పాటు చేస్తామని అమిత్‌షా ప్రకటించారు.
ఢిల్లీ పోల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఎన్విరాన్మెంట్ సీనియర్ ఇంజినీర్ మహమ్మద్ ఆరీఫ్ నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ. 2.39 కోట్ల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.
బిహార్‌లో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
బీజేపీ ఎన్నికల మిషన్ కాదని, అలా చెప్పడం పార్టీని అవమాన పరచడమేనని, పార్టీ కార్యకర్తల కృషి, ధైర్యం ఫలితంగానే ఎన్నికల్లో గెలుపు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతి కలలను తీర్మానాలుగా రూపొందించుకుని, వాటిని సాధించడం, అందుకోసం పూర్తి అంకితభావంతో పనిచేయడం చేయాలన్నారు.
'బుల్డోజర్ న్యాయం' పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది.
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్‌లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో ఆదివారంనాడు చేరారు. వారికి బీజేపీ ఢిల్లీ యూనిట్ పార్టీ కండువా కప్పి స్వాగతించింది.