Home » Nidadavole
నిడదవోలు అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులు గెలుపు తమదంటే ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన గెలుపు మాదేనని ఉమ్మడి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప.గో.జిల్లా: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు.
జనసేనా నుల రాకతో ఎటు చూసినా జనం.. జనం.. నిడదవోలు ప్రజాగళం సభ దద్దరిల్లింది. వారాహి విజయభేరిగా ఈ సభ మార్మోగింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో భలే ఊపు వచ్చింది.
నిడదవోలు సాక్షిగా మూడు పార్టీల అధినేతలు ఒక్కటయ్యారని.. ఇది 3 పార్టీల సింహ గర్జన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలులో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచార సభ జరిగింది. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు.
Janasena Candidates: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా.. మరో సీనియర్ నేతను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం ఇసుక లోడింగ్ పాయింట్ దగ్గర రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇసుక పడవలు, లారీ ఓనర్స్ మధ్య రేటు విషయంలో విభేదాలు చోటుచేసుకున్నాయి
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...