Home » Nifty
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం (శుక్ర వారం) ట్రేడింగ్‌లో భారీ నష్టాన్ని చవిచూశాయి. ఒక దశలో 1,219 పాయింట్లు క్షీణించి 81,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్.. చివరికి 1,017.23 పాయింట్ల (1.24 శాతం) నష్టంతో 81,183.93 వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్టు 30)తో ముగిసిన వారంలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. ఇది సెన్సెక్స్-నిఫ్టీ కంటే తక్కువ పనితీరును కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ సిరీస్‌కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్‌లో ముగిశాయి. నేడు (ఆగస్టు 30న) మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి.
గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి.
అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 23న) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాలతో మొదలై, మళ్లీ లాభాల్లోకి వచ్చి ఉదయం 10.13 గంటల నాటికి సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 81,020 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 24,800 పరిధిలో ఉంది.
గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది.
రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్‌లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9.16 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ50 సూచీ 70 పాయింట్లకుపైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది.
గడిచిన రెండ్రోజులుగా బేర్ రంకెతో స్టాక్ మార్కెట్ షేర్లు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం కాస్త ఉపశమం లభించింది. ఐటీ స్టాక్‌లలో కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ప్రభావం చూపించాయి.