Home » Nimmala Rama Naidu
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.