Home » Nimmala Rama Naidu
ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.
పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.
రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...
సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించానని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లలో నీటుపారుదల శాఖకు కేవలం రూ.49 కోట్లు బడ్జెట్ కేటాయించారని అన్నారు.
అమరావతి: జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అలాగే మాల్యాల పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో పర్యటనకు వెళతారు.
త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.