Home » Nirmala Sitharaman
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.
నేడు (సెప్టెంబరు 9న) 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోపాటు పలువురు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్-95 నేషనల్ యాజిటేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది.
సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు.
ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
లోక్‌సభలో(loksabha) ఆగస్టు 7న ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న పలువురు ప్రతిపక్ష సభ్యులు ఆరోగ్య బీమా, జీవిత బీమా(insurance) ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.