Home » Nitin Jairam Gadkari
దేశాభివృద్ధి కోసం పనిచేసే శక్తిసామర్య్థాలను ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి(Minister Janardhan Reddy), ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే(Kantilal Dande) తదితరులు ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.
విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(MP Kesineni Sivanath) వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు.
విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు.