Home » Nizamababad
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.
బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.
ఓ యువకుడి ఆన్లైన్ బెట్టింగ్ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.
‘కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. రాబోయే రోజులు మీవే.. అందరికీ పదవులు వస్తాయి.. కొంత ఓపిక పట్టండి.. సీఎం రేవంత్‌రెడ్డి నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అధికారం రావడానికి కష్టపడ్డాం. కార్యకర్తల కోసం పని చేస్తాం.
దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్ గౌడ్‌కు పురస్కారం దక్కింది.
కూతురు ఆత్మహత్యకు అల్లుడే కారణం అని రగిలిపోతున్న ఓ తండ్రి.. తన అల్లుడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. నేరుగా అల్లుడి ఇంటికి వెళ్లగా అతడు కనిపించకపోవడంతో వియ్యంకుడిపై తన కోపాన్నంతా చూపాడు.
Telangana: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సిరికొండ మండలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.సిరికొండ మండలానికి ఇతర ప్రాంతాలకు రాకపోకల బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.