Home » Nobel Prize
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ క్షేమంగానే ఉన్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ తెలిపారు. తమ తండ్రి మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని కోరారు.
ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది మొహమ్మదికి 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేతలను స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ బుధవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లాయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ లను విజేతలుగా అకాడమీ ప్రకటించింది.
భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్ కు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ (Narendra modi) ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీకి చేరిందని, ఈసారి శాంతి బహుమతికి (Nobel Peace Prize 2023) ఆయనే ప్రధాన పోటీదారుడంటూ గురువారం పలు జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ ...