Home » NRI Latest News
ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
యూఏఇ ఎన్.ఆర్.ఐ. టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ప్రధాని నరేంద్ర మోదీ కువైత్ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన సభలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా తమ పార్టీ పతాకాన్ని ప్రముఖంగా ప్రదర్శించి ఆసక్తిని రేకెత్తించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209 వ సాహిత్య సదస్సు ''జగము నేలిన తెలుగు'' అంశంపై డిసెంబర్ 15న డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించారు.
ఏపీ సీఎం చంద్రబాబును నేడు మెల్బోర్న్ తెలుగుదేశం నేతలు సచివాలయంలో కలిశారు. మెల్బోర్న్ టీడీపీ శాఖ తరపున సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 లక్షల విరాళం అందజేశారు.
అంతర్జాతీయ విమానశ్రాయ హోదా కల్గిన తిరుపతి విమానశ్రాయాన్ని కార్యచరణలో కూడా ఆ దిశగా మార్చాలని తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు, గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న రాయలసీమ జిల్లాల ప్రవాసీయులకు ప్రయోజనం చేకూరుతుందని సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా-సెంట్రల్) ప్రముఖుడు రంజీత్ చిట్టలూరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.
ప్రముఖ టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ సింగపూర్‌లో సందడి చేశారు. సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో ఇష్టాగోష్టి, ఆత్మీయ అభినందన సమావేశం జరిగింది. స్థానిక సరిగమ బిస్ట్రో రెస్టారెంట్, లిటిల్ ఇండియాలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నెలసరి కిరాణా సామాన్లు కొనుక్కొని ఎడారిలోని తమ క్యాంపునకు బస్సులో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది గాయపడ్డారు.
సేవా ఇంటర్నేషనల్, అట్లాంటా చాప్టర్ నిర్వహించిన వార్షిక గాలా కార్యక్రమం విజయవంతమైంది. సంస్థ చేపట్టబోయే వివిధ సేవా కార్యక్రమాలకు దాతలు 5.4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్‌తో ఆన్లైన్లో ఎన్నారైల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం.