Home » NRI Organizations
అన్న ఎన్టీఆర్ వీరాభిమానులకు నిలయమైన డెట్రాయిట్‌లో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండి తెర రాముడు, తెలుగింటి అన్నగారు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఎన్నికల సంఘం సభ్యులు రెడ్డి ప్రసాద్, సీతారామ రావు, నెట్టెం ప్రసాద్, డి. కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగ్గా, మే12 న ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తెలుగు కళా సమితి నూతన కార్యవర్గ కమిటీ 2023-2024 ఏర్పడింది.
"వీధి అరుగు, నార్వే" ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే. నందమూరి తారకరామారావు శతవసంతోత్సవాల్లో ఎన్టీఆర్‌ను ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వంగా 2023 మే 27న జరిగాయి.
అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.
బోస్టన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మే 20 తారీఖున మినీ మహానాడు 2023 వేదికగా వైభవంగా నిర్వహించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండితెర రాముడు తెలుగింటి అన్నగారు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
ఈ ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం, ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసుపల్లి రాంబాబు అనే ఓ తెలుగు యువకుడు సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్లోని డాక్టర్లు వాడమన్న ట్రామాడోల్ ట్యాబ్లెట్ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేసినా.. సౌదీ దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో అతడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ సాయంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమయింది.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ భారతీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు.