Home » NRI
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బాధితున్ని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. సౌదీ అరేబియా కువైత్ దేశాల సరిహద్దు ఎడారుల్లో ఒంటెల కాపరిగా పని చేస్తూ, నరకయాతన అనుభవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో..
సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది.
కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగువెన్నెల", తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు, 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు టెక్సాస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.
2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాలలోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది.
ఇటీవల తుఫాను వరద తాకిడికి గురై నష్టపోయిన ఖమ్మం రూరల్ మండలం ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తానా ఫౌండేషన్ సభ్యులు చేయూత అందించారు. పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిచి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు.
Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..