Home » NTR District
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది.
ఎన్టీఆర్ జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు.
Andhrapradesh: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
Andhrapradesh: జిల్లాలోని జి.కొండూరులో, మైలవరం మండల పరిధిలోని పూరగుట్ట లే అవుట్లలో ఇళ్ల నిర్మాణలను ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు గురువారం పరిశీలించారు. నివాసితులతో మంత్రి పార్థసారథి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
యూట్యూబర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలా ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసుకుని వాటి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్ చేసుకుని..
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారుపాలెంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం నెపంతో కొందరు ఆమెను వివస్త్రను చేసి అనంతరం చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు.
Andhrapradesh: నందిగామ నియోజకవర్గ అధికారిక సమీక్షా సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ... సమస్యలపై ఒకసారి మీ అందరితో మాట్లాడి తెలుసుకోవడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు.
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ పి. నైనవరం, నున్న నుంచి వేళంకిణికి 70 మంది గ్రామస్తులు పయనమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే వేళంకిణికి వస్తావని మొక్కుకున్నామని నైనవరం గ్రామస్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరిందని, టీడీపీ నాయకుడు దేవేంద్ర ఆధ్వర్యంలో 70 మంది నైనవరం గ్రామస్తులు వేళంకిణికి బయలుదేరి వెళ్లారు.