Home » Odisha
ఆయిల్ ట్యాంకర్ ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది(accident). దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్‌పై నుంచి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కల్తీ మద్యం తాగి.. 14 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒడిశాలో చికితా ప్రాంతంలోని మౌండ్‌పూర్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగిన అనంతరం వీరంతా వాంతులు చేసుకోవడంతో.. స్థానికులు వెంటనే స్పందించారు. ఆ క్రమంలో వారిని చికితాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
పంద్రాగస్టు వేడుకల వేళ ఒడిశాలోని(Odisha) బీజేపీ సర్కార్ వనితలకు శుభవార్త చెప్పింది. మహిళా ఉద్యోగుల కోసం ఒక రోజు నెలసరి సెలవు (Menstrual Leave) పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
ఒడిశాలోని ఐఎన్ఎస్ చిలుకలో అగ్నివీర్ నాల్గవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటి మూడు బ్యాచ్‌ల్లో 2,500 మంది శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరారని తెలిపారు. 2022లో అగ్నివీర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..
మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి.. వైద్య చికిత్స అందించారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆమోదించారు.