Home » Osmania university
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
రాజధాని హైదరాబాద్లో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియాకు మహార్దశ పట్టనుంది. ఆ ఆస్పత్రికి కొత్త భవనాలను రూ.2075 కోట్లతో.. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టిన పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉస్మానియాలో 175 ప్రొఫెసర్ పోస్టులకుగాను 651 దరఖాస్తులు వచ్చాయి. 572 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు.
నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష గట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్న భయానక వాతావరణం ఇప్పుడు తిరిగి పునరావృతం అవుతోందని చెప్పారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
నిర్ణీత గడువులోగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక మరోసారి రీఅడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త.
గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.
నీట్, నెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.