Home » Palla Srinivasa Rao
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్, కేవలం పది నిమిషాలపాటు అసెంబ్లీలో డ్రామా ఆడి వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారంతా జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేశారు.
TDP Leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు మండిపడ్డారు. జైలులో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంతోపాటు బయట మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ తల్లిని, చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా ? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.
TDP: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తులసిబాబు... గుడివాడ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ సమాంతరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.
Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్‌బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్‌రావు హెచ్చరించారు.
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...
Palla Srinivasa Rao: టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్‌గా లోకేష్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌రావు తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని ఉద్ఘాటించారు.
Palla Srinivas: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి రూ.11,400 సాయం రావడం అంత చిన్న విషయం కాదని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కార్మికులు, నిర్వాసితులు పోరాటం మర్చిపోలేనిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుపోతుందని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్న ప్రధాని మోదీ, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడానికి కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమినేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు.
Palla Srinivasa Rao: అసమర్థత, అవినీతి, ఆరోపణల మీద తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు.