Home » Palnadu
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో యువకుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో దారుణం జరిగింది. తమ్మిశెట్టి చిరంజీవి అనే వ్యక్తిపై ఓ యువతి పెట్రోలు పోసి నిప్పంటించింది.
Palnadu Crime: పల్నాడులో ఓ యువకుడిపై యువతి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
Inter Students Problems: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ కాసేపు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..
చాగంటివారిపాలేనికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా బొల్లవరం శివారు మాదల మేజరు కాలువ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.
పుట్టుకతోనే బిడ్డకు సమస్య ఉందని తెలిస్తే ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు ఆ శిశువును సజీవ సమాధి చేయడం.. లేక చెత్త కుప్పల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బిడ్డను అమ్మేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే పల్నాడు జిల్లాలోని ఓ వృద్ధ జంట మాత్రం పుట్టినప్పటి నుంచి నయంకాని ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన నలుగురు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
Turaka Kishore: వైసీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు మాచర్ల కోర్టు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
Andhrapradesh: ఆన్లైన్ బెట్టింగ్‌లో లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయి.. వాటి తీర్చే మార్గం తెలియక ప్రాణాలు తీసుకోడానికి కూడా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్లైన్లో బెట్టింగ్ చేసి లక్షలకు పైగా డబ్బులు పోగోట్టుకున్నాడు. చివరకు అప్పుల బాధతో యువకుడు తీసుకున్న నిర్ణయం ఇంట్లో విషాదాన్ని నింపింది.
పల్నాడు: నరసరావుపేటలో చిన్నారులతో దొంగతనాలు చేయిస్తూ ఓ ముఠా రెచ్చిపోతోంది. అమాయక పిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తున్న ముఠా సభ్యులు వారితో చోరీలు చేయిస్తున్నారు. మాట వినని వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.