Home » Palnadu
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది.
Andhrapradesh: పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.
పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని అనుకున్నదే తడవుగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలను దాడులకు ఊసిగోల్పుతుంది.
Andhrapradesh: మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతల పట్ల అంబటి రాంబాబు అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. కాలితో తన్నుతూ విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
Andhrapradesh: జిల్లాలో అధికారపార్టీ అరాచకాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా వైసీపీ దారుణాలకు పాల్పడుతోంది. నిన్న ఓ టీడీపీ నేత బైక్‌ను తగులబెట్టిన వైసీపీ శ్రేణులు ఈరోజు (శనివారం) మరో ఘాతుకానికి పాల్పడ్డారు.
Andhrapradesh: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు.