Home » Parliament Special Session
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
వక్ఫ్ బోర్డు(Waqf Board) చట్టానికి అనేక సవరణలు కోరుతూ కేంద్రం రేపు పార్లమెంటులో బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలకు మంత్రివర్గం శుక్రవారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి (జులై 22) ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్(Budget 2024)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు.
మణిపూర్లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కాని ఆర్థిక చర్యలతో దేశంలో 'ఆర్థిక అశాంతి' నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తోందని తప్పుపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ పై చతురోక్తులు గుప్పించారు. ఆయనను 'చిన్నపిల్లోడు' గా అభివర్ణించారు.