Home » Parliament
Citizenship Amendment Act, 2019: దేశంలో సీఏఏ అమలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని నోటిఫై చేసి అమలు చేస్తామని అమిత్ షా తెలిపారు. ఈ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించిందని... CAA ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు.
ఎన్డీఏ హయాంలో అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తి కావడం, ఆలయం గురించి పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు.
అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ శుక్రవారంనాడు విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున 10వ తేదీన ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావాలంటూ మూడు లైన్ల విప్లో కోరింది.
చైనా, భారత్ సరిహద్దులపై నిత్యం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలకు ఇండియా సైన్యం దీటుగా సమాధానమిస్తోంది. అయినా నిత్యం ఇలాంటి పరిస్థితులే ఉండటంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్ సభ వేదికగా స్పందించారు.
PM Narendra Modi: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ.
PM Narendra Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్‌డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.