Home » Parliament
18వ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. అయితే మళ్లీ ప్రధాని మోదీ ఎందుకు ఓం బిర్లాను ఎంచుకున్నారు. ఆయన నేపథ్యం, ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో(Lok Sabha Speaker election) ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్కు చెందిన కె సురేష్తో పోటీ పడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దేశంలో లోక్సభ స్పీకర్(Lok Sabha Speaker) అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓటింగ్ జరగనుంది.
అసలే ధరల పెరుగుదల కారణంగా బతకడమే కష్టమవుతున్న సమయంలో పన్నుల భారాన్ని కూడా మోపడాన్ని నిరసిస్తూ కెన్యా దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రొట్టెలు, వంటగ్యా్సపైనా పన్ను వేయడంతో
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్సభకు వన్నె తెచ్చారు.
నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.