Home » Payyavula Keshav
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు 20 నిమిషాల పాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు.విజయవాడ సహా... రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలతో సంభవించిన నష్టంపై కేంద్ర మంత్రికి వివరాలు తెలిపారు.
గత ప్రభుత్వంలో చేసిన బిల్లుల చెల్లింపు అంశంపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్‌గా ఉన్నారు. తనకు తెలియకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దాంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం (ఈరోజు)మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.
తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు అరుదైన...
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ జిల్లాలో తొలిరోజే 98 శాతం పూర్తి అయింది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. కలెక్టరేట్ ఎనఐసీ నుంచి డీఆర్డీఏ-వెలుగు పీడీ ఓబులమ్మ, ఏపీడీ ఈశ్వరయ్య నేతృత్వంలో 41 మంది ఉద్యోగులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 663 సచివాలయాల పరిధిలో 5,685 మంది సిబ్బంది, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. కలెక్టర్ డాక్టర్ ...
నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రజా దర్బారు నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలను తెలిపేందుకు వచ్చిన నాయకులు, ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. అక్కడికక్కడే పరిష్కరించలేని సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. సుమారు రెండు..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలైంది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.