Home » Peddapalli
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.
‘‘మాది ఫ్యూడల్ గవర్నమెంట్ కాదు.. పీపుల్స్ గవర్నమెంట్.. మీలాగా ఇళ్లల్లో పడుకోవడం లేదు.. ప్రతీరోజు ప్రజల్లోనే ఉంటున్నాం.. నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకున్నారు.
బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్పాషా శనివారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓదెల మండలం చిన్నకొమిరె గ్రామానికి చెందిన కడెం తిరుపతికి కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ శివారులో 28 గుంటల భూమి ఉంది.
Telangana: పెద్దపల్లి జిల్లా ఓడేడు మండలం మానేరు వంతెన నిర్మాణంలో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. గత తొమ్మిదేళ్లుగా వంతెన పనులు చాలా ఆలస్యంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న (మంగళవారం) భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు, జయశంకర్ భూపలిపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్యలో మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గర్డర్లు మంగళవారం రాత్రి కుప్పకూలాయి.
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్-కాట్నపల్లి మధ్య రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.
భూమి పంపకాల వివాదం.. ఓ ప్రాణాన్ని బలిగొంది. దాయాదుల ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంచిన్నపొర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన సంజప్ప(28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.