Home » Peddapalli
రామగుండం అభివృద్ధిపై ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తున్నామని, రాబోయే 30 నుంచి 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభి వృద్ధి పనులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్టీసీకాలనీ, చంద్రబాబుకాలనీ, కేసీఆర్‌కాలనీ, శారదానగర్, ఫైర్‌స్టేషన్ ఏరియాల్లో పర్యటించారు.
మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు అందక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. యాభై పడకల ఆసుపత్రిలో గర్భిణులు, నవజాత శిశువులు లేకపోవడంతో బోసిపోతోంది. మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, మల్హర్, కాటారం మండలాలతోపాటు ఇతర మండలాల్లోని మారుమూల గ్రామాలకు మంథని మాతా శిశు ఆరోగ్యకేంద్రం అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కను సన్నలలో ఎన్టీపీసీలో బూడిద దందా నడు స్తోందని, ఎమ్మెల్యే అనుయాయులైన కొం దరు కాంట్రాక్టర్లు లారీకి 4 వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కౌశిక హరి ఆరోపిం చారు. మంగళవారం ఎన్టీపీసీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్కలపల్లి యాష్‌పాండ్ నుంచి ఎన్టీపీసీ ఒక రూపా యికే టెండరు ద్వారా బూడిద ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సి ఉం డగా కొందరు దళారులు ఇటుకల పరిశ్రమల యజమానులకు రవాణా చేస్తున్నారన్నారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈనెల 25వరకు జరిగే పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 23పరీక్ష కాంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష జరగనుంది.
యాసంగి పం టలో చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్య దర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ యాసంగి పంట సంరక్షణకు రానున్న పది రోజు లు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్ సరఫరా అవసరమైన మేర పొలాలకు చేరేలా చూడాలని, వ్యవసాయ శాఖకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు.
జిల్లా అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మంథని, ముత్తారం మండలాల్లో ఐదు రోజులుగా సంచరిస్తోంది. ప్రధానంగా గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల్లో, సమీప అడువుల్లో సంచరిస్తున్నట్లు ఫారెస్టు, ఎనిమల్ ట్రాకర్స్ గుర్తించారు. అప్ర మత్తమైన అధికారులు పెద్దపులి సంచారంపై ఆరా తీస్తూ సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు 7వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఎన్టీపీసీ లేబర్ గేటు వద్ద సీఐ టీయూ అనుబంధ రామగుం డం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భూపాల్ ప్రసంగించారు.
విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదం డ్రులకు పేరు తీసుకురావాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కళాశాల మైదానంలో ఉద్బవ్-25 కార్యక్రమా నికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు.
దేశ ఆర్థిక అభివృద్ధిలో కేంద్ర గిడ్డంగుల సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ స్పందన అన్నారు. గర్రెపల్లిలోని సిడబ్ల్యుసి గోదాములలో ఆదివారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను హతమారుస్తుందని, ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో డిఫెన్స్ ఫోర్స్ నాయకులు సీపెల్లి రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.