Home » Penukonda
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.
తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైస్ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.