Home » Perni Nani
ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.
Andhrapradesh: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండు నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కూడా ఏ రోజు చూడని పోలీసు పోకడలను చూస్తున్నామని విమర్శించారు.
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను (Courier Srinu) ఘాటైన విమర్శలు గుప్పించారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని... ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఓ డ్రగిస్ట్ అని సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం సుబ్బరాయన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రతి అధికారి ఇవ్వాల్టితో పని అయిపోయిందని అనుకుంటున్నారా?
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.