Home » Phone tapping
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది.
Telangana: ‘‘నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారు’’ జైపాల్ యాదవ్ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలైన బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారించే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజాకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎ్సఎల్) నిపుణులు తిరిగి (రిట్రీవ్) రాబట్టారు.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఉమ్మండి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టవ్వగా.. తాజాగా ఖద్దరు ప్రమేయంపై విచారణ మొదలైంది.
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా ..