Home » PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
జమ్మూ-కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడంలో అర్థం లేదని కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం సరికాదని, వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.
మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh)కు సంబంధించి ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా పాకిస్థాన్ ఆహ్వానించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎ్‌స)’ను కాంగ్రెస్ ఎద్దేవాచేసింది.
మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై హత్యాచారం,