Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Revanth vs Kishan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమాధానాలు చెప్పాల్సిందేనంటూ ఆయనకు పలు ప్రశ్నలు వేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
ప్రజలు 80-90 సార్లు తిరస్కరించిన గుప్పెడుమంది వ్యక్తులు పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ రాజకీయ లబ్ధి కోసం అరాచకానికిపాల్పడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
రాష్ట్రానికి ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. విశాఖపట్నం పూడిమడకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో 1200 ఎకరాల్లో నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, గ్రీన్ ఇండస్ట్రియల్ హబ్లకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత ఒక్క తాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి మేధోమథనం చేస్తే కచ్చితంగా త్వరతిగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని నొక్కిచెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతోపాటు రాజకీయ వ్యూహాలకూ పదును పెట్టే యోచనలో ఉంది.
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.