Home » Polavaram
ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌లో కీలక కట్టడాలైన డయాఫ్రమ్‌వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణంపై ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్(పీవోఈ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన అధ్యయన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి రూ.2,424.463 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేసే పనులు 2027 మార్చినాటికి పూర్తి చేయాల్సిందేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ జైన్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బొనాంజా. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు.. రాష్ట్రంలో 2 ఇండిస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఫైళ్లను శుక్రవారం రాత్రి తగలబెట్టేశారు. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా,
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాల సాక్ష్యాలను తెరమగురు చేసే ప్రయత్నం ప్రతి శాఖలోనూ జరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు.