Home » Police case
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.
కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్‌కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై అతడి స్నేహితులు దాడి చేశారు. దీంతో అతడు గుంటూరులోని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య కారణం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ వరద బాస్కర్ అనే వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టడంపై పోలీసులు కేసు నమోదు చేసి బాష్కర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో...
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వారిద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని నవంబర్ 6వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ తిన్నారు.
గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది.
హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.