Home » Police case
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.
యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.
ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
కోల్‌కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అయిదు రోజుల కిందట జన్మించిన శిశువును విక్రయించాలని నాగ్‌పూర్‌లోని దంపతులు సునీల్, శ్వేత నిర్ణయించారు. ఆ క్రమంలో స్థానిక మధ్యవర్తులను సంప్రదించారు. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో మధ్యవర్తలు బంధువులు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు ఆ శిశువును కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..
విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.