Home » Ponnam Prabhakar
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Telangana: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని, అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కులగణనపై బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని.. అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని చెప్పారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
Telangana: తెలంగాణలో కులగణనను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ సర్పంచులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేస్తుందని, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో వారు బలి కావొద్దని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మోదీ కేబినెట్లోని మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. వారిలో తెలంగాణ డీఎన్ఏ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చాలా చేసిందంటూ చెబుతున్న కేంద్ర మంత్రులు ఇద్దరికీ ఈ సందర్బంగా బహిరంగ సవాల్ విసిరారు. అందుకోసం అమర వీరు స్తూపం వద్ద చర్చకు వస్తారా? అంటూ కేంద్ర మంత్రులకు ఈ సందర్భ:గా మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.