Home » Ponnam Prabhakar
అధికారులపై దాడులు చేస్తే ఎంతమాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నాం.
Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.
రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Telangana: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని, అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కులగణనపై బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని.. అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని చెప్పారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
Telangana: తెలంగాణలో కులగణనను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.