Home » Protest
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది.
సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
మణిపూర్(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.
గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన, బెల్ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు ఆర్అండ్ఆర్ చట్టం అమలు చేసి, పరిహారం అందించాలంటూ భూనిర్వా సితులు చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. వారు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండురోజల నిరసన క్యాక్రమాన్ని మంగళవారం చేపట్టిన విషయం విదితమే. రెండో రోజు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు వెంకటేశ, మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్ హాజరై ప్రసంగిం చారు.
జీఓ 84ను రద్దుచేయాలని మునిసిపల్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంజీ ఎం పాఠశాల వద్ద మునిసిపల్ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జీఓ నెంబర్ 84 వల్ల రెండేళ్లుగా మున్సిపల్ విద్యావ్యవస్థ సర్వనా శనం అయిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి మునిసిపల్ విద్యావ్యవస్థను తెచ్చేందుకు గత వైసీపీ పాలనలో ఈ జీఓను తెచ్చారని మండిపడ్టారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.