Home » Pulivendula
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
అమరావతి: ప్రతిపక్ష నేతగా గుర్తించి సభా నాయకుడితో సమానంగా మైక్ ఇచ్చి మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లోఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్‌తో సహా మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు.
భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పులివెందుల ఆర్డీఓ గనేష్ణ భానుశ్రీ లక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష అన్నారు.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.
చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి) పేర్కొన్నారు.
ఓ పక్క పదిరూపాయల నాణెం చెల్లుతుందని ఆర్బీఐ చెబుతున్నా నాణేలు తీసుకునేందుకు వ్యాపా రులు నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ.. చివరికి పెట్రోలు బంకుల్లో సైతం ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.
వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.