Home » Punjab
విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అధిక సంపాదన కోసం పంజాబ్(Punjab) నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు(Madapur SOT, Petbashirabad Police) అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.02 లక్షల విలువైన గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్ వినేశ్ ఫొగట్ మద్దతు పలికారు.
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. అలాంటి వేళ.. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో హవేలి కథువా నుంచి రావల్పిండి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 29 మంది దుర్మరణం పాలయ్యారు. పనా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి అతడిపై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించింది. అమెరికా నుంచి ఇటీవల అమృత్‌సర్‌కు ఎన్నారై సుఖ్‌చైన్ సింగ్ వచ్చారు. శనివారం ఉదయం డబుర్జి ప్రాంతంలోని అతడి నివాసంలోని ఇద్దరు ఆగంతకులు చొరబడి.. అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి ముఖానికి, చేతికి గాయాలయ్యాయి.
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ తగ్గింది. టోల్‌ప్లాజాల దగ్గరకు వాహనం వెళ్లగానే ఫాస్టాగ్ కోడ్ స్కాన్ అయి ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. అయితే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది.