Home » Punjab
ఎవరైనా ఉద్యోగి సెలవు అడిగితే యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? వీలైతే సెలవు ఇస్తుంది.. లేకపోతే కదరదు అని చెబుతుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ సెలవు అడిగిన ఉద్యోగినిని ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేసింది. ఇరవై రోజులు టైమిచ్చి ఆపై కంపెనీకి రావాల్సిన అవసరం లేదని టెర్మినేషన్ లెటర్ పంపింది.
పంజాబ్‌లో దారుణం జరిగింది. తన కూతురిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురుని తీసుకెళ్లిపోయిన యువకుడి సోదరిని మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్లో రికార్డు చేశాడు.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో వర్షాలు(rains) దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో వర్షం కారణంగా పలు ఘటనల్లో 28 మంది మరణించారు. రాజస్థాన్(rajasthan)లో రెండు రోజుల్లో 16 మంది మరణించారు. దీంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వర్షం ప్రభావం కనిపించింది.
కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.
ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్ డీసీ నుంచి మెల్బోర్న్ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నామని హెచ్చరించారు.
భారత హాకీ జట్టుకు మద్దతు తెలిపేందుకు పారిస్ ఒలింపిక్స్ వెళ్లాలని నిర్ణయించుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్రం అనుమతి నిరాకరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ఆగస్టు 4న
చండీగఢ్ కోర్టులో శనివారంనాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై సొంత మామయ్య కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోగా, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పంజాబ్ పఠాన్‌కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు.
వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్‌ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.