Home » Punjab
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అఫ్కోర్స్.. చాలా చోట్ల వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడితాపం ఇంకా తగ్గలేదు.
కొందరు యువకులు జల్సాలకు అలవాటు పడి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు చోరీలనే వృత్తిగా ఎంచుకుని చివరకు జైలుపాలవుతుంటారు. ఇంకొందరు రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు దిగుతుంటారు. ఇలాంటి...
దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండా గిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ''అబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో ఈసారి ఎన్నికల్లో దిగడం, ఇంతవరకూ జరిగిన ఆరు విడతల ఎన్నికలో దాదాపు లక్ష్యానికి చేరుకున్నామని క్లెయిమ్ చేసుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 400 సీట్ల క్లెయిమ్ ''బక్వాస్'' (నాన్సెన్స్) అని కొట్టిపారేశారు.
డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు.
స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుర్తుచేశారు.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్.. జూన్ 1వ తేదీన జరగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కానుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ.. ఎవరికి వారు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకున్నారని విమర్శించారు.