Home » Puttaparthi
తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు పుట్టపర్తి(Puttaparthi)తో విడదీయరాని బంధం ఉంది. సామాజిక సేవ, దాతృత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా.. సత్యసాయి బాబా సూచన మేరకు విద్యావాహిణి ప్రాజెక్టుకు సహకారం అందించారు.
పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.
స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్‌లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు.
జిల్లాలో అక్రమ విద్యుత వాడకంపై విద్యుత శాఖ విజిలెన్స అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత వాడకం దారులపై జరిమాన విధించారు. నగరంలోని డి-5సెక్షన, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, అమరాపురం మండలాల్లో విద్యు త విజిలెన్స ఈఈ గోపి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు.
పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.
ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్, బాలాజీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, మెయిన బజార్లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని శ్రీరంగరాజులపల్లికి బదిలీచేశారు. అయితే టీచర్ బదిలీని రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత వారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.