Home » Puttaparthy
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు. తెలిపారు. పౌష్టికా హార మాసోత్సవాలను బుధవారం మెళవాయి పంచాయతీ కేంద్రంలో ని అంగనవాడీ కేంద్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పీడీ మా ట్లాడుతూ... గర్భణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంగనవాడీ కార్యకర్తలకు సూచించారు.
అమరాపురం మండలం కరిదాసనహట్టి గ్రామంలోని మండల పరిషత పాఠశాల భవనాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీ లిం చారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఉండడం గమనించారు. చిన్నపాటి వర్షానికే పాఠశాల భవనం అంతా కారుతోందని గ్రామ స్థులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన సంబంధిత అధికా రులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సూచిం చారు.
పట్టణంలోని శివానగర్లోవెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శ్రావణ మాస చివరి శనివారం పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు అభిషేకాలు చేశారు. పూలు, తులసి తమలపాకులు, వడమాలతో అలంకరించారు.
మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ సప్లై ప్లాంటు వద్ద సత్యసాయికార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివా రం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.... తమకు గౌరవ వేతనం ఆర్నెల్ల నుంచి అందించకపోవడంతో కుటుం బాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మట్టిని తింటూ నిరసన తెలిపారు.
మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో ఉప్పర తిప్పన్న అనే రైతుకు చెందిన పాప్‌కార్న్ మొక్కజొన్న పంటపై బుధవారం అర్ధరాత్రి అడవి పందు లు దాడిచేశాయి. దీంతో రూ.లక్ష పంట నష్టం వాటిల్లినట్లు బాఽధిత రైతు తెలిపాడు. ఉప్పర పోతన్నకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. బోరుకింద మొక్కజొన్న సాగుచేశాడు.
పట్టణ వీధుల్లో ఆదివారం నగర సంకీర్తనను వైభవంగా నిర్వహించారు. సత్యసాయి పల్లకిని మోస్తూ భక్తిపాటలు ఆలపించారు
రాష్ట్రంలో కూటమి విజయంలో కీలకభూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో క్షీరాభిషేకం చేశారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎంగా పవనకళ్యాణ్ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక హనుమానకూడలిలో సంబరాలు చేసుకున్నారు.
ప్రతి మహిళా సాధికారత సాధించాలని ఆర్డీటీ మహిళా విభాగ డైరెక్టర్ విశాలా ఫెర్రర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో ఉమెన కోఆపరేటివ్ సొసైటీని బుధవారం ఆమె ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్‌కు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు.
వలంటీర్‌పై దాడి