Home » Puttaparthy
మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
పొలసు పురుగు నివారణపై చీనీ రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. చీనీని పీడిస్తున్న పొలుసు అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బుఽధవారం సాయంత్రం శమీనారాయణస్వామి ఆలయంలో చేనేతల సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు.
మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.
చీనీ పంటకు వ్యాపించే పొలుసు పురుగుపై రైతులు జాగ్రత్త వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిశోర్ పేర్కొన్నారు. సోమవారం తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి వద్ద చీనీ తోటను పరిశీలించారు.
చెస్‌తో క్రీడతోమేధాశక్తిని పెంపొందించుకోవచ్చని ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని కొత్తపేట శ్రీఉషోదయ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్రాస్థాయి ఓపెన చెస్ పోటీలను సత్యనారాయణ, కార్యదర్శి సుమన ప్రారంభించారు.
రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత అందించాలని విద్యుత అధికారులకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ప్రజాసమస్యల పరిస్కారం కోసమే తెలుగుదేశంపార్టీ ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ భవనంలో శనివారం ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
అత్తారింటిలో హిమజ(26) అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. స్నానాల గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని అత్తారింటివారు చెబుతుండగా, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.