Home » R Krishnaiah
రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్ బాబు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..
గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది.
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు.
ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
వచ్చే డీఎస్సీలో 26వేల ఉపాధ్యాయ పో స్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో గురువారం దిల్సుఖ్నగర్ లో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఆయన పాల్గొన్నారు.
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.