Home » Rain Alert
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం నాటికి బలహీనపడనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలు/తుఫాన్లకు అనుకూలంగా మారింది. గత నెలలో ఒక తుఫాన్ రాగా, ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది.
ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతోంది.
Andhra Pradesh Weather: ఏపీని ఓ వైపు ఫెంగల్ తుపాను భయపడుతుండగా.. మరో బాంబు పేల్చారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి ఫెంగల్ ముప్పు తక్కువే అయినా.. మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు.
ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరంపైకి వచ్చినప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు(సుమారు 12 గంటలపాటు) అక్కడే స్థిరంగా కొనసాగిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఫెంగల్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
‘ఫెంగల్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి.