Home » Rain Alert
ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. భారీ వానలకు జలాశయానికి గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.భాస్కరరావు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు మినహా అన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశముందని పేర్కొంది.
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం మొదలైనప్పటికీ ఇంకా వర్షాలు(heavy rainfall) మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో నేటితోపాటు వచ్చే మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ సహా 18 రాష్ట్రాల్లో వానలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే వరదలు అతలాకుతలం చేయగా.. భారత వాతావరణ శాఖ (IMD) మరో హెచ్చరిక జారీ చేసింది.
: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి.