Home » Rains
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర టెలి కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష బీభత్సంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబాబాద్లో వర్ష ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. మరిపెడ మండలంలో సీతారాం తండా వర్షపునీటితో నిండిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు(Rains) కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకల పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది.
ఖమ్మం: జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.
దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా?
గత రెండు రోజులుగా నందికొట్కూరు పట్టణంలో వర్షం కురుస్తూనే ఉంది.
పిఠాపురం, ఆగస్టు 31: ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. వర్ష ప్రభావంతో ప్ర భుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావంతో పిఠాపురం, పరిసర ప్రాంతా ల్లో శనివారం